కరోనా తర్వాత భారత్ లో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. తాజాగా, డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మైగవ్ ఇండియా సంస్థ నివేదిక ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో 8950 కోట్ల డిజటల్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన లావాదేవీల్లో భారత్ వాటా 46 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. మిగతా 4 స్థానాల్లో ఉన్న దేశాల్లో జరిగిన లావాదేవీలు అన్ని కలిపినా భారత్ కంటే తక్కువగానే ఉన్నాయి.