రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు జీఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ మరింత బలోపేతంపై నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి నుంచే బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, క్లస్టరు పరిధిలో ఉన్న యూనిట్ ఇన్చార్జ్లను,బూత్ ఇన్చార్జిలతో ఎప్పటికపుడు సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. గత నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలే తప్ప లభివృద్ధి జాడలేదని సంక్షేమం కుంటుపడిందన్నారు. రైతులు, చేతివృత్తిదారులు, రోజువారీ కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుక, వట్టి, ఖనిజ వనరులు విచ్చలవిడిగా దోచుకుంటూ వారి సొంత ఖజానా నింపుకుంటున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను గ్రామస్థాయిలో ప్రజలకు తెలిసే విధంగా నాయకులు, కార్యకర్తలు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు. చంద్రబాబునాయుడిని సీఎంని చేసే వరకు నిరంతరం కృషిచేయాలన్నారు.