పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో సుమారు 40 మంది గిరిజనులు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లారు. ఆదివారం పార్లమెంట్లో ఉన్న సెంట్రల్ హాల్లో గిరిజనులతో కొన్ని శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు ముఖాముఖి అయ్యారు. సోమవారం మన్యం గిరిజనులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఈ సందర్భంగా గిరిజనుల జీవన స్థితులు తదితర విషయాలను రా ష్ట్రపతి స్వయంగా వారి ద్వారా తెలుసుకుంటారని సమాచారం. ఇదిలా ఉండగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ , పార్లమెంట్, అంబేడ్కర్ భవన్‌ను జిల్లా గిరిజనులు సందర్శించారు.