ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్య ఇస్తున్నారని రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి అన్నారు. సోమవారం రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న రామారావు మున్సిపల్ హైస్కూల్లో జరిగిన నాలుగో విడత జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర కమిషన్ దినేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.