బీజేపీతో ఇంతకాలం YCPకి ఉన్న సయోధ్య ముగిసినట్టే కనిపిస్తోంది. ఏనాడూ BJPకి వ్యతిరేకంగా మాట్లాడని సీఎం జగన్.. ఈరోజు బీజేపీ అండ లేకపోయినా పర్వాలేదన్నారు. పల్నాడు జిల్లా క్రోసూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని, అయినా పర్వాలేదని అన్నారు. తాను ప్రజలనే నమ్ముకున్నానని… ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలే తన బలం అని పేర్కొన్నారు.