చదువుకునే ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవర్చుకోవాలని పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించారు. గ్రంథాలయంలో నిర్వహించిన పలు అంశాలలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదువుతోపాటు పుస్తక పఠనం తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రంధాలయ ఇన్చార్జ్ రామకృష్ణ, మాజీ సర్పంచ్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.