ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ వేమా అన్నారు. ఆదివారం మలికిపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల20 నుంచి జూలై 1 వరకు నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించాలన్నారు. బూత్ స్థాయి వరకు రాష్ట్ర పార్టీ ముద్రించిన కేంద్ర ప్రభుత్వ పథకాలను కరపత్రాల ద్వారా తెలియచేయాలన్నారు. సమావేశంలో అడబాల రాం బాబు, అడబాల సత్యనారాయణ, కె.శ్రీనివాసరావు, కె.నాగే శ్వరరావు, శివరామకృష్ణంరాజు, కె.కనకేశ్వరరావుపాల్గొన్నారు.