వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం అనగా నేడు పునః ప్రారంభం కానున్నాయి. కాగా.. ప్రస్తుతం వడగాల్పులు, తీవ్ర ఉష్గోగ్రతల నేపథ్యంలో ఈ నెల 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది. 11.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి.. విడిచిపెట్టాలని సూచించింది. 19వ తేదీ నుంచి యథావిధిగా తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాలలను శుభ్రం చేసి.. తరగతుల నిర్వహణకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు.