ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్పు కోసమే మళ్లీ వచ్చా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 12, 2023, 01:57 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వాస్తవాలు ప్రజలకు తెలియడం లేదని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కొందరు నాయకులు కావాలని చెప్పడం లేదని, అలాగే మీడియా కూడా బయటకు తేవడం లేదన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆయన అమిత్‌ షా సభలో పాల్గొనడానికి ఆదివారం విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలు నచ్చకే కొద్దికాలం దూరంగా ఉన్నానని, వాటిలో మార్పు కోసమే మళ్లీ వచ్చానని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంటుకు బయ్యారం గనులు ఇస్తామని ఆఫర్‌ చేశామని చెప్పారు. అయితే అది పెల్లెట్ల తయారీకే ఉపయోగపడుతుందని, ఓబుళాపురం కావాలని వారు అడిగారని, అది కోర్టు కేసుల్లో ఉండటంతో ఇవ్వలేకపోయామని వివరించారు. ఎవరికీ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, సంక్షేమం ముఖ్యమే కానీ, వారి జీవితమంతా అలాగే ఉంచే పథకాలు సరికావన్నారు. కాంగ్రెస్‌ విధానాలు నచ్చకే బయటకు వచ్చానన్నారు. దక్షిణాదిలోనూ బీజేపీ పుంజుకుంటుందని, తెలుగు రాష్ట్రాల్లో మంచి స్థాయికి వస్తుందని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com