తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో చెప్పి అప్పుడు బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే బాగుండేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 2014-19మధ్య జరిగిన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందన్నారు. 2014 ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కనీసం ఒక్క మాటైన చెప్పకుండా 20 పార్లమెంట్ సీట్లు ఇవ్వండని అడుగుతున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.