ప్రపంచం అంతా అంబేద్కర్‌ను కొనియాడుతుంటే.. ఏపీలో మాత్రం అంబేద్కర్‌కు అడుగడుగునా అవమానం జరుగుతుందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అంబేద్కర్ విగ్రహం పెట్టుకునే అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. కోనసీమ జిల్లాలో దళితులపై నిత్యం దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మంత్రి దాడిశెట్టి రాజా అండతో దళితులపై చెలరేగిపోతున్నారన్నారు. గోకవరం మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని కాపు సామాజిక వర్గం అడ్డుకుందన్నారు. మంత్రి దాడిశెట్టి రాజా ప్రోద్భలంతో దళితులపై దాడి చేశారని ఆరోపించారు. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ ఆదేశాలు ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు.