రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను నెక్స్ట్ జనరేషన్ స్థాయి యువతగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం కరిక్యులమ్, మౌకలి సదుపాయాలు, వనరుల సమీకరణ, ల్యాబ్‌ల అవసరాలు తదితర అంశాలపై నివేదిక సమర్పించేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇందులో అధికారులతో పాటు మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి సంస్థల ప్రతినిధులను చేర్చింది. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, ఐటీ శాఖ కార్యదర్శి సభ్య కార్యదర్శిగా, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కమిషనర్ కన్వీనర్‌గా ఉంటారని తెలిపింది.