ఆస్ట్రేలియా దేశంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహానికి అతిథులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి 10 మంది దుర్మరణం చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని హంటర్ వ్యాలీ రీజియన్ గెట్రా పట్టణంలోని కూడలి వద్ద ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రుల్లో 21 మంది ఆస్పత్రిలో ఉన్నారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సోమవారం వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.