విద్యుత సంస్థల్లో థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ విద్యుత కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్ రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం (జి3045) జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల క్రమబద్దీకరణకు సంబంధించి విద్యుత యాజమాన్యం తరుపున క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదికలు పంపాలన్నారు. 2022 పీఆర్సీతో పాటు డీఏ, ఇంక్రిమెంట్లతో కూడిన వేతనాలు ఇవ్వాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.20 లక్షల ఆర్థికసాయం అందించాలన్నారు. సబ్‌స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాని, సీఎం జగన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, అడ్మిస్ట్రేటివ్ కార్యదర్శి వెంకటేశ్వరప్రసాద్, నాయకులు మధుకుమార్, జయరాజ్, లక్ష్మినారాయణ, రాజద్‌ఉత్తమ్ పాల్గొన్నారు.