ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ సొంత నగరమైన క్రైవీ రిహ్‌పై రష్యా క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల్లో ఐదంతస్తుల అపార్ట్ మెంట్‌తోపాటు పలు ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉండొచ్చని ఆ నగర మేయర్ వెల్లడించారు. ఇప్పటివరకు ముగ్గురు చనిపోగా.. దాదాపు 25 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, ఘటనకు సంబంధించిన ఫోటోలను డెనిప్రోపెట్రోవ్స్క్ గవర్నర్ షెర్హీలిసాక్ టెలిగ్రామ్‌లో షేర్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa