ఇది శాండ్.. ల్యాండ్.. వైన్.. మైన్ సర్కార్ కాదా అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. విశాఖపట్నం వేదికగా అమిత్ షా, శ్రీకాళహస్తి గడ్డపై జేపీ నడ్డా.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిధులు తాము ఇస్తే.. ఫొటోలు ముఖ్యమంత్రివి పెట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అదే సమయంలో.. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ అంటూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. జేపీ నడ్డా, అమిత్ షాపై విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తాజాగా.. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
మీది శాండ్, ల్యాండ్, వైన్, మైన్ ప్రభుత్వం కాదా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ అడిగింది నాలుగు ప్రశ్నలే అని.. ఆ నాలుగు ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక నవ్వుల పాలయ్యారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు చేతనైతే అమిత్ షా, నడ్డా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 817 బార్లు వైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. పేదలకు పంచే భూములను.. వైసీపీ నేతలు ముందే కొని.. దాన్ని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మారని వ్యాఖ్యానించారు.