పులివెందుల పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న ఎలక్ట్రికల్ షాపులో రమణారెడ్డి అనే వ్యక్తి అక్రమంగా నిలువ ఉంచిన 19 గ్యాస్ సిలిండర్లను మంగళవారం పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డిటి గోవిందరావు తెలిపారు. రమణారెడ్డి ఇంటిలో నిఖీలు నిర్వహించగా 14 డొమెస్టిక్ సిలిండర్లు, ఐదు కమర్షియల్ సిలిండర్లు లభించాయని, వాటిని సీజ్ చేసి 6ఏ కింద కేసు నమోదు చేశామని డీటి పేర్కొన్నారు.