ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ-98 కాంట్రాక్టు ఉపాధ్యాయుల సేవలను రెన్యువల్ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 11 నెలల కాలానికి గానూ ఉపాధ్యాయుల కాంట్రాక్టును పొడిగించింది. 2023 జూన్ 1వ తేదీ నుంచి 2024 ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉపాధ్యాయుల కాంట్రాక్టును పొడిగిస్తూ జీవో జారీ చేసింది. ఒక నెల ‘నో వర్క్-నో పే’ విధానాన్ని అనుసరిస్తామని విద్యాశాఖ తెలిపింది.