జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటనలో రాత్రిబసపై సందిగ్ధత నెలకొంది. ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం 14వతేదీ సాయంత్రం కత్తిపూడిలో బహిరంగసభ తర్వాత రాత్రి గొల్లప్రోలు చేరుకుని సత్యకృష్ణ ఫంక్షన్‌హాలులో బస చేయాల్సి ఉంది. బుధవారం రాత్రి హాలును ఫంక్షన్‌కోసం వేరేవాళ్లు ముందుగానే బుక్ చేసుకోవడంతో రాత్రి బస విషయంపై సస్పెన్స్ నెలకొంది. జనసేన నాయకులు ఫంక్షన్ హాలును 15, 16వతేదీలకు బుక్ చేసుకున్నారు. దీంతో పవన్‌కల్యాణ్ బుధవారంరాత్రి కత్తిపూడిలో లేదా అన్న వరంలో రాత్రి బస చేస్తారా, లేకుంటే గొల్లప్రోలులోనే ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తారా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది.