తొమ్మిదేళ్ల బీజేపీ పరిపాలనలో దేశంలో పేద, బడుగు, బలహీనవర్గాల వారికి సమన్యాయం అందించడంతో పాటు వారి అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక చర్యలు చేపట్టారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌కుమార్ గౌతమ్ పేర్కొన్నారు. ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సమావేశం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మా ట్లాడారు. గత కాంగ్రెస్ పార్టీ హయంలో పేదల కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అయితే నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక పార్లమెంటల్ సమావేశాల్లో పేద, బడుగుబలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక రకాల సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. దేశంలో ధర్మం నాలుగు పాదాలపై నడవాలంటే బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ హయంలో మతాలు, కులాల మధ్య చిచ్పుపెట్టి వారి రాజకీయ స్వార్థానికి అనేక మందిని బలిచేశారని విమర్శించారు. ఈ సందర్భంగా దుష్యంత్‌కుమార్ గౌతమ్‌ను కళాశాల యాజమాన్యం సత్కరించింది.