ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, అజయ్ కల్లాం, శామ్యూల్ పదవికాలాన్ని పొడిగించినట్లైంది. సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి పదవుల్లో ఉన్నవారికి గడువు పూర్తైన వెంటనే తొలగిస్తుంటాయి. వీరి స్థానంలో వేరేవారిని నియమిస్తుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి మార్పులు చేయడానికి సిద్ధంగా లేదనే సంకేతాలు ఇస్తోంది. రాబోయే ఎన్నికల్లో వీరి సలహాలు ఎంతో అవసరం కానున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.