మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో పంక్చర్ షాప్ నడుపుతున్న అన్వర్ ఖాన్ కూతురు మిస్బాహ్ నీట్ యూపీ పరీక్ష క్రాక్ చేసింది. మిస్బాహ్ నీట్ పరీక్షల్లో 720 మార్కులకు 633 మార్కులు సాధించింది. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది. మిస్బాహ్ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. తండ్రి అన్వర్ పంక్చర్ వేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఉచితంగా కోచింగ్ తీసుకుని మిస్బాహ్ తన రెండవ ప్రయత్నంలోనే నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిందని తండ్రి అన్వర్ తెలిపారు. ఎంబీబీఎస్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకుంటుందన్నారు.