ముద్దనూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఓబులాపురం, కోడికాండ్లపల్లి, కాండ్రోపల్లి గ్రామాలకు నూతన గ్రామ వాలంటీర్లుగా ఎంపికైన వారికి మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ రెడ్డి గురువారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా వాలంటీర్ గా ఎంపికైన వారు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముద్దనూరు మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, ఈవో పి ఆర్ డి వీరభద్రుడు పాల్గొన్నారు.