భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. గురువారం తై జుయింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు 18-21, 16-21 తేడాతో వరుస సెట్స్‌లో పరాజయం పాలైంది. కాగా ఇప్పటిదాకా తై జుయింగ్‌తో 24 సార్లు పోటీపడిన సింధు కేవలం 5 సార్లు మాత్రమే గెలిచి 19 సార్లు ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓటమితో ప్రీక్వార్టర్ ఫైనల్లోనే సింధు ఇంటిదారి పట్టింది.