ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో మటన్ కర్రీ ఓ పెళ్లి రద్దయ్యేలా చేసింది. సంబల్ పూర్ కు చెందిన యువతికి, సుందర్ గడ్ కు చెందిన యువకుడికి వివాహం నిశ్చయమైంది. విందులో వరుడి బంధువులు ఓ ఐదారుగురికి మటన్ కర్రీ చాలలేదు. వారు మటన్ కావాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో వారు అర్ధరాత్రి ఓ రెస్టారెంట్ నుంచి మటన్ తెచ్చి వడ్డించారు. ఈ విషయం వధువుకి తెలిసి తన తల్లిదండ్రులను అవమానించారంటూ పెళ్లి రద్దు చేసింది.