మా చెమటవాసనే గిట్టనప్పుడు మా ఓట్లు నీకెందుకు చంద్రబాబూ..? అంటూ వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నందిగం సురేశ్ ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కంటే నారా లోకేశ్ ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్ పారిపోతారు. పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత సినిమాలు తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడో చెప్పాలి. మాదిగలపై అక్రమ కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా?. మాదిక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు మోసం చేశాడు. చంద్రబాబు.. మాదిగలకు ఎంపీ సీటు ఇచ్చాడా?. 29 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని మేలు ఏపీలో దళితులకు జరిగింది. చంద్రబాబు దగ్గర కొందరు నేతలు బానిసలుగా ఉన్నారు. ఎస్సీలను రాజధానిలో చంద్రబాబు దొంగలుగా చిత్రీకించారు. వర్ల రామయ్యకి రాజ్యసభ ఇస్తానని అవమానించింది చంద్రబాబు కాదా?. ఎస్సీలలో ఎవరు పుట్టాలని అనుకుంటారని చంద్రబాబు అవమానించలేదా? అని నిలదీశారు.