అసెంబ్లీలో సీఎం జగన్ జూదంలేని రాష్ట్రంగా చేశామని ప్రగల్భాలు పలికారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఈరోజు ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని యెద్దేవా చేశారు. 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందన్నారు. సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లను మాత్రం మూసేశారన్నారు. అనధికారికంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుస్తున్నాయని ఆరోపించారు. చిలకలూరిపేట పేకాటకు అడ్డాగా మారిందన్నారు. చిలకలూరిపేటలోని అపార్ట్‌మెంట్లలో జోరుగా జూదం నడుస్తుందని అన్నారు. సగటును రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్నారని తెలిపారు.