ఓ యువకుడు 22 కి.మీ లు పరిగెత్తి ఎన్నికల్లో నామినేషన్ వేసిన ఘటన పశ్చిమ బెంగాల్లోని దార్జీలింగ్ జిల్లాలో జరిగింది. సొనాడ గ్రామానికి చెందిన సుబ్బా 22 కి.మీ.లు పరుగెత్తుకుంటూ వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేశాడు. తమ గ్రామం ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని, మా గ్రామంలో ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగానని అని సుబ్బా తెలిపాడు.