గుజరాత్‌లోని కఛ్ జిల్లా జఖౌ పోర్ట్ సమీపంలో తీరం దాటిన బిపర్‌జాయ్ తుఫాన్ దాని ప్రతాపం చూపిస్తోంది. కఛ్, దేవభూమి ద్వారక, ఓఖా, భుజ్, పోర్‌బందర్, తదితర జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, చిన్నపాటి ఇళ్లు నేలకూలాయి. గురువారం రాత్రి అందిన సమాచారం ప్రకారం.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గుజరాత్ హోంశాఖ సహాయమంత్రి సంఘ్వీ తెలిపారు. ఇప్పటికే తీర ప్రాంతాలకు చెందిన లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ప్రభుత్వ బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని ఆయన తెలిపారు.