ఒడిశాలోని కేంద్రపార జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అశుతోష్ ఆచార్య (10) అనే బాలుడు బ్రహ్మణ నదిలో స్నానం చేస్తుండగా.. హఠాత్తుగా మొసలి బాలుడిపై దాడి చేసింది. అతడిని నోట చిక్కించుకుని నీటిలోకి వెళ్లిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొసలి సగం తినేసిన బాలుడి శరీరం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు.