జీవియంసి జోన్ 2 పరిదిలో 7వ వార్డు లో వాంబేకోలనీ మరియు దుర్గా నగర్ కోలనీ లకు సంభందించి శుక్రవారం జీవియంసి సాధారణ అంచనా విలువ రూ 30. 72 లక్షలు నిదులతో 2 పార్కులు అభివృద్ధి చేయుటకు మరియు 7వ వార్డు చంద్రంపాలెం - ఓల్డ్ పి. యం. పాలెం మరియు కళానగర్ లో జీవియంసి సాధారణ అంచనా విలువ రూ 48. 00 లక్షలు నిధులతో సిసి కాలువలు సిసి కల్వర్టు లు నిర్మాణం చేయుటకు మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరియు కార్పోరేటర్ పిల్లా. మంగమ్మ చేతులమీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. కార్యక్రమం లో బాగంగా అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గం లో అన్ని ప్రాంతాలు తో పాటు జీవియంసి మదురవాడ జోన్ లో జీవియంసి నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది.
సుమారు 3, 600 మందికి జగనన్న ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందని వైసిపి ప్రభుత్వం పేదల సంక్షేమం కోరే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పాలన అందించి అందరి మన్ననలు పొందుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం జగనన్న తోనే సాద్యం అనేలా చేస్తున్నారని అవంతి అన్నారు. గత ప్రభుత్వాలు లా మాటలు తో కోటలు కట్టడం జగనన్న రాదు చేతలతో చేసి చూపడమే తెలుసని ప్రజలు అందరూ జగనన్న పాలనపై సంపూర్ణ నమ్మకంతో ఉన్నారని రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం విజయం తథ్యమని నియోజకవర్గం అభివృద్ధి కై అంచెలంచెలుగా కట్టుబడి ఉన్నానని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీవియంసి అదికారులు - 7వ వార్డు వైసిపి శ్రేణులు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు