తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టాలని ఇంధన శాఖను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లో లోవోల్టేజీ సమస్యను పూర్తిగా నివారించాలన్నారు. గొల్లపూడి సచివాలయంలో శుక్రవారం ఈపీడీసీఎల్పై సమీక్షను నిర్వహించారు. సమీక్షలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధరబాబు, ఈపీడీసీఎల్ సీఎండీ పృధ్వీతేజ్ తదితరులు పాల్గొన్నారు.