ఏసీబీ కోర్టు వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ హైకోర్టులో అప్పీల్ వేశారు. ఒకసారి నోటీసులు జారీ చేసిన తరువాత అభ్యంతరాలు చెప్పుకొనే అవకాశం ఇవ్వకుండా జప్తు విషయంలో ఏసీబీ కోర్టు ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారు. ఈ ఏడాది మే 18న ఏసీబీ కోర్టు తమకు నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో వాదనలు చెప్పుకొనేందుకు అవకాశం కల్పించాలన్నారు. జప్తు నిర్ణయం కారణంగా ప్రభావితమయ్యే వ్యక్తులు, తమ అభ్యంతరాలు చెప్పుకొనే అవకాశం ఇవ్వకూడదని ఆర్డినెన్స్‌లో లేదన్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు.