రైల్వే ప్యాంట్రీ సిబ్బందిపై సత్యసాయి జిల్లా ఏఆర్ పోలీసుల వీరంగం సృష్టించారు. పుట్టపర్తికి వచ్చేందుకు కర్ణాటక ఎక్స్ప్రెస్లో అనంతపురం వద్ద ప్యాంట్రీ బోగిలోకి ఏఆర్ పోలీసులు ఎక్కారు. అయితే ప్యాంట్రీ బోగీలో ప్రయాణించకూడదని సిబ్బంది సూచించారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ పోలీసులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎదురు దాడి చేశారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ రాగానే మరికొందరు పోలీసులతో కలిసి వంటగది బోగి సిబ్బందిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో ప్యాంట్రీ మేనేజర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ప్యాంట్రీ సిబ్బందిని హిందూపురం రైల్వే ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.