బీహార్ లోని బక్సర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్నంగా బుల్లెట్ బైక్ తీసుకురాలేదనే కోపంతో అత్తామామలు కోడలికి విషం తాగించి చంపేశారు. అనంతరం ఆమె అనారోగ్యానికి గురైందంటూ పుట్టింటికి వెళ్లి చెప్పారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, విషం తాగడం వల్లే మరణించిందని వైద్యులు వెల్లడించారు. బాధితురాలికి గతేడాది వివాహం కాగా, అత్తామామలు అప్పట్నుంచే అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు.