జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికోసం సుపారీ గ్యాంగులను దింపారనే సమాచారం ఉందని తెలిపారు. వైసీపీని గద్దె దింపే దిశగా జనసేన పయనిస్తుందని, అధికారం పోతుందన్న భావనతో వారు ఏం చేయడానికైనా సిద్ధపడతారని అన్నారు. జనసేన నాయకులు, జనసైనికులు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని సూచించారు.