అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. ఫిలడెల్ఫియా హైస్కూల్లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ క్రమంలో డిప్లొమా పొందేందుకు ఓ విద్యార్థిని డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లింది. అది గమనించిన ప్రిన్సిపల్ లీసా మెసి ఆ విద్యార్థినికి పట్టా ఇచ్చేందుకు నిరాకరించారు. విద్యార్థినిని స్టేజ్ దిగమని చెప్పి.. ఆమె కళ్ల ముందే పట్టాను బుట్టలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.