జమ్ముకశ్మీర్ లో శనివారం రాత్రి భూకంపం సంభవించింది. లడఖ్, దోడా జిల్లాల్లో అర్థరాత్రి భూమి కంపించింది. లడఖ్ లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. 10 నిమిషాల వ్యవధిలోనే 4.4 తీవ్రతతో దోడా జిల్లాలో భూకంపం వచ్చింది. కాగా, ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.