ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిక్కిం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా రహదారులు స్తంభించిపోయాయి. లాచెన్, లాచుంగ్ ప్రాంతాల్లో 60 మంది కళాశాల విద్యార్థులతో సహా 2,464 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పర్యాటకులను తరలించేందుకు బస్సులు, వాహనాలు అందుబాటులో ఉంచారు. 123 మంది ప్రయాణికులను గ్యాంగ్టక్ను తరలించినట్లు సమాచారం.