అచ్యుతాపురం: అచ్యుతాపురం పరవాడ ప్రధాన రహదారిలో రామన్నపాలెం గ్రామానికి దగ్గర సోమవారం తెల్లవారుజామున వడదెబ్బకు నీలపు అప్పారావు మృతి చెందాడు. స్థానికలు సమాచారం మేరుకు ఘటన స్థలానికి చేరుకొనికేసు నమోదు చేశారు. పోలీసులు వివరాలు ప్రకారం అప్పారావు కొన్నాలుగా తాపీ మేస్త్రి దగ్గర కూలీ పని చేస్తుండేవాడు అని. అప్పుడప్పుడు చెత్త కాగితాలు ఏరుకుండేవాడని అన్నారు. మృతి చెందిన వ్యక్తి గోపాలపట్నం దగ్గర వెంకటాపురం గ్రామం చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్లు తెలపారు. మృతునీ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చామన్నారు.