కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని జీవీఎంసీ 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకట రమణ అన్నారు. ఈమేరకు జీవీఎంసీ 51వ వార్డు పరిధి గాంధీ నగర్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం నిర్వహించిన "జనాభాగీ దారీ" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ఫోర్ డెవలప్మెంట్ కార్నర్స్ ఏర్పాటు చేసి అంగన్వాడీ ద్వారా చిన్నారులకు పౌష్టిక ఆహరం అందించడంతో పాటుగ ఆట - పాటలతో కూడిన విధ్యను అంధించడం జరుగుతుందన్నారు. సమాజంలో చిన్నారులకు పూర్వప్రాథమిక విద్యా కార్యక్రమాల ఆవశ్యకతపై అవగాహనను పెంపొందించటానికి జన భాగీదారీ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ మర్రిపాలెం ప్రాజెక్ట్ సెక్టర్ -2 సూపర్ వైజర్ జేటిఎన్ జ్యోతి "జనాభాగీ దారీ"కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై చిన్నారుల తల్లి దండ్రులకు అవగహన కల్పించారు. తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి అంగన్వాడీ ద్వారా చేస్తున్న ప్రీ-స్కూల్ కార్యక్రమాలు పిల్లల సమగ్రాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో అన్న విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మౌలాబీబీ, సచివాలయం మహిళా పోలీసు వరలక్ష్మీ, ఏఎన్ ఎం శ్రవంతి, ఆశ వర్కర్ కనక మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.