13 నెలల చిన్నారి 2 కిడ్నీలను 30 ఏళ్ల వ్యక్తికి అమర్చారు బెంగళూరులోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు. సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీహర్ష హరినాథ్ నేతృత్వంలోని వైద్యుల బృందం, రోబోటిక్ ఎన్ – బ్లాక్ అనే విధానంలో 4 గంటలు శ్రమించి ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ వినూత్న విధానం ద్వారా మార్పిడి చేసిన కిడ్నీలు, గ్రహీత శరీర బరువుకు తగిన పరిమాణంలో పెరుగుతాయని వైద్యులు తెలిపారు.