విశాఖ ఎన్ఏడీ గాజువాక మద్దిలపాలెం బోయపాలెం షీలానగర్ బీచ్ రోడ్డు కాన్వెంట్ జంక్షన్ తదితర ప్రాంతాలలో స్కూలు బస్సులను తనిఖీ చేయడం జరిగిందని ఉప రవాణా కమీషనర్ రాజారత్నం తెలిపారు. అయితే మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో అన్ని బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. తనిఖీలు ఈ నెల 30వ వరకు కొనసాగుతాయని ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న బస్సులను గుర్తిస్తే యాజమాన్యం పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. తనిఖీలలో మోటర్ వాహన తనిఖీ అధికారులు ఆర్ సుధీర్, బాలాజీ రావు, సత్యం నాయుడు, పి శిరీష, శ్రీనివాస్ యాదవ్, శిరీష దేవి, సృజన పాల్గొన్నారు.