ఏలూరు జిల్లాలో ఖైదీలకు స్పెషల్ డ్రైవ్ ద్వారా ఐదు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ అధికారిణి డాక్టర్ పి.రత్నకుమారి అన్నారు. జిల్లా జైలులో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఆంద్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్, ఎస్టీఐ, హెచ్‌ఐవి, టీబీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పరీక్షలను సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రత్నకుమారి మాట్లాడుతూ...... ఖైదీల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా జైలర్ శ్రీనివాసరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి డీపీఎం డాక్టర్ శ్యామ్‌సన్, డీఐఎస్ హరినాధ్‌కుమార్, షేర్ ఇండియా పీవో గంధం జగధీష్, ఎఆర్‌పి డాక్టర్ బ్యూలా, వినోద్‌కుమార్ పాల్గొన్నారు.