కంచరపాలెం ట్రాఫిక్ సిఐ మళ్ళ అప్పారావుఆధ్వర్యంలో హెల్మెట్ దారణ పై ద్విచక్ర వాహనదారులకు ఎన్ఏడి జంక్షన్లో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ హెచ్ సిరామకృష్ణ వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహన దారులు వాహనాన్ని నడిపేటప్పుడు తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని త్రిపుల్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో రాంగ్ రూట్ ప్రయాణాలు చేయరాదన్నారు. మైనర్లు వాహనాలు నడప రాదని మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం వాహనాలపై అధికంగా ఉన్న పెండింగ్ చలానాలను కట్టించుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.