సంస్థాగత నిర్మాణంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని,సమన్వయంతో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వైయస్ఆర్ సిపి రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. తాడేపల్లిలో వైయస్ఆర్ సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో విజయసాయిరెడ్డి సోమవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటు, త్వరలో ప్రభుత్వం నిర్వహించనున్న జగనన్న సురక్ష కార్యక్రమం పై ఈ టెలి కాన్ఫరెన్స్ లో విజయసాయిరెడ్డి మాట్లాడారు.