ఐఐటీ బాంబేకు చెందిన పూర్వ విద్యార్థుల గ్రూపుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని 315 కోట్లు విరాళం ఇచ్చారు. ఐఐటీ బాంబే 50 ఏళ్ల వేడుకల్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన విరాళం ప్రకటించారు. 1973లో ఐఐటీ బాంబేలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ చేశారు. తన విరాళంతో ఆ విద్యా సంస్థలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.