పాండిచ్చేరి నగరంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. బస్సీ రోడ్డులో ఓ ప్రైవేట్ బస్సును స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది బాలికలకు, ఆటోడ్రైవర్ విఘ్నేష్ (22)కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రక్షించారు. హుటాహుటిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రంగస్వామి పరామర్శించారు.