ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను టీడీపీ నేతల బృందం ఇవాళ భేటీ కానున్నది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలోని ముఖ్య నాయకులు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తో ఈ మేరకు కలవనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. అలాగే చెరుకుపల్లిలో బాలుడు అమర్నాథ్ హత్య సహా పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.