న్యూజిలాండ్ లో విషాధకర ఘటన చోటుచేసుకొంది. ఆ దేశంలోని చైనీస్ రెస్టారెంట్లలో భోజనం చేస్తున్న వారిపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌లో జరిగిందీ ఘటన. దుండగుడి దాడిలో గాయపడిన నలుగురిలో ఒకరు డిశ్చార్జ్ కాగా, చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
గత రాత్రి 9 గంటల సమయంలో మూడు చైనీస్ రెస్టారెంట్లలోకి ప్రవేశించిన దుండగుడు అక్కడ డిన్నర్ చేస్తున్న వారిపై గొడ్డలితో దాడికి దిగాడు. దీంతో రెస్టారెంట్లలోని జనం భయంతో పరుగులు తీశారు. తాను ఓ రెస్టారెంట్‌లో తన ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి గొడ్డలితో తన వద్దకు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అతడిని చూసిన ప్రతి ఒక్కరు వెంటనే నిలబడి ‘ఏం చెయ్యబోతున్నావ్?’ అంటూ భయంతో పెద్దగా అరిచారని పేర్కొన్నారు. ఆ వెంటనే అతడు తన ఫ్రెండ్‌పై మళ్లీ దాడిచేశాడని చెప్పారు. ఈ ఘటన తర్వాత పోలీసులు 24 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa